ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాకుంభ మేళాకు వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మీర్జాపూర్ ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన భక్తులు బొలేరో వాహనంలో మహాకుంభమేళాకు ప్రయాణిస్తుండగా, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన బస్సును బొలేరో వాహనం అతివేగంగా ఢీ కొనడంతో ఘోరం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం సమాచారం తెలియగానే ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాధ్ థాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితుల వివరాలను సేకరిస్తున్నారు.గత వారం మహాకుంభ మేళాకు వెళుతోన్న భక్తుల వాహనం మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో తెలుగు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 50 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మరో వారం రోజుల్లో ఈ సంఖ్య 56 కోట్లకు చేరవచ్చని అంచనా.