Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

చేతిలో గన్స్‌తో ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో… : మణిపూర్‌లో ఐదుగురి అరెస్ట్

Phaneendra by Phaneendra
Feb 15, 2025, 12:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి భద్రతా పరిస్థితిపై అధికారులు దృష్టి సారించారు. కుకీ మెయితీ తెగల మధ్య ఘర్షణల కారణంగా ఉద్రిక్తపూరితంగా మారిన మణిపూర్‌లో అక్రమ కార్యకలాపాలను అధికారులు ఉక్కుపాదంతో అణిచేస్తున్నారు. ఆ క్రమంలోనే మణిపూర్ పోలీసులు గురువారం రాత్రి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. కారణం, వారు ఎకె-47వంటి ఆధునిక తుపాకులు ధరించి ఫుట్‌బాల్ ఆడడమే.

ఈశాన్య భారత ప్రాంత రాష్ట్రం మణిపూర్‌లో ఈమధ్య ఒక వీడియో వైరల్ అయింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోకు విస్తృత ప్రాచుర్యం లభించింది. కాంగ్‌పోక్‌పీ జిల్లా కె గామ్‌నోమ్‌ఫాయ్ గ్రామంలో 10-15 మంది వ్యక్తులు ఫుట్‌బాల్ ఆడారు. అయితే వారి చేతిలో ఫుట్‌బాల్ లేదు. దానికి బదులు వారు అసాల్ట్ రైఫిల్స్ ధరించి ఉన్నారు. ఆ చర్య 1959 నాటి ఆయుధాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు స్పష్టం చేసారు. దాంతో వారు తక్షణం చర్యలు తీసుకున్నారు.

ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తుపాకులు ధరించి పోజులు ఇచ్చిన వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేసారు. అసలు వారికి ఆయుధాలు ఎక్కడినుంచి వచ్చాయి, ఉగ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగంగా ఆయుధాలను అక్రమంగా ప్రదర్శించిన సంఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.     

మణిపూర్‌లో పలువురు అతివాదుల దగ్గరుండే ఆయుధాల తనిఖీ సరిగ్గా జరగడం లేదన్న ఆందోళనలున్నాయి. మారణాయుధాలను బహిరంగంగా ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మెయితీ కోఆర్డినేటింగ్ కమిటీ, మెయితీ హెరిటేజ్ సొసైటీ వంటి సంస్థలు ఇప్పటికే పిలుపునిచ్చాయి.   

మణిపూర్‌లో ఇప్పుడు అధ్యక్ష పాలన విధించినందున, కేంద్రం అక్కడ భద్రతను పటిష్టం చేసింది. చట్టవ్యతిరేక ముఠాలను పట్టుకోడానికి అదనపు బలగాలను మోహరించింది. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటామని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరిస్తామని, పౌరుల భద్రత రక్షణలే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర రక్షణ శాఖ పునరుద్ఘాటించింది.

Tags: Football With GunsIllegal ArmsManipurPolice Arrest FivePresident RuleTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.