పుల్వామా ముష్కరుల దాడిలో అమరులైన వీర జవానుల త్యాగాలకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా విజయవాడలో పాదయాత్ర చేపట్టారు.
విశ్వహిందూ పరిషత్ యువ విభాగం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అమర జవాన్ల సంస్మరణ కార్యక్రమం జరిగింది. సత్యనారాయణపురం విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుండి శివాజీ కేఫ్ సెంటర్, BRTS రోడ్డు శారదా కాలేజీ సెంటర్‌కు పాదయాత్రగా చేరుకుని అమర వీరులకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఉపాధ్యక్షులు శ్రీమతి లక్ష్మి కుమారి, వైఎస్ఎస్ ప్రసాద్, కార్యదర్శి క్రోవి రామకృష్ణ, ధర్మ ప్రసార ప్రముఖ్ వీరశేఖర్, సత్సంగ్ ప్రముఖ్ బాలాజీ, ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ్ సహ కార్యవాహ కోటమర్తి చక్రధారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ప్రఖండ కార్యదర్శులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, పూర్వ సైనికులు, వివేకానంద మెమోరియల్ ప్రతినిధి యుగంధర్, తదితర దేశభక్తులు పాల్గొన్నారు.