ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం
ఫిబ్రవరి 20: భారత్ VS బంగ్లాదేశ్
ఫిబ్రవరి 23: భారత్ VS పాకిస్తాన్
మార్చి 2 : భారత్ VS న్యూజీలాండ్
పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోన్న ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కు సర్వం సిద్ధమైంది. విజేతలకు ఐసీసీ భారీ ఫ్రైజ్ మనీ ప్రకటించింది. చివరగా 2017లో ఈ టోర్నీ జరిగా అప్పటితో పోలిస్తే దాదాపు 53 శాతం ప్రైజ్‌మనీని ఐసీసీ పెంచింది. సుమారు రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని జట్లకు పంచనుంది. విజేత జట్టుకు రూ. 20.8 కోట్లు, రన్నరప్ కు రూ. 10.4 కోట్లు
సెమీ ఫైనలిస్టులుకు రూ. 5.2 కోట్లు (ఒక్కొక్క జట్టుకు) ప్రైజ్ మనీ అందనుంది. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్టుకు రూ.3 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాలకు పరిమితమయ్యే జట్టుకు రూ.1.2 కోట్లు అందనున్నాయి. ప్రతి మ్యాచ్‌కు ప్రైజ్‌మనీ కింద రూ.29 లక్షలు చెల్లించనున్నట్లు ఐసీసీ తెలిపింది.
ఈ టోర్నీ కోసం ఇప్పటికే ఎనిమిది జట్లు తమ ఆటగాళ్ళ పేర్లు వెల్లడించాయి.పాకిస్తాన్ లో ఆడేందుకు భారత్ జట్టు విముఖత చూపడంతో ఆ జట్టు ఆడే మ్యాచ్ ల వేదికలను దుబాయ్ కు మార్చారు. ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, భారత్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 23న దాయాదుల పోరు, మార్చి 2న న్యూజీలాండ్ తో భారత్ తలపడనుంది.
అనుభవజ్ఞులు, ఆల్ రౌండర్లు, కొత్త బౌలర్లలో భారత జట్టు సర్వశక్తిమంతంగా కనబడుతోందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగ ఉంది.
రవీంద్ర జడేజా, హర్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్లు అదనపు బలంగా ఉన్నారు . వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా లు గాయంతో ట్రోఫికి దూరమైన బూమ్రా లోటును పూడ్చేందుకు తహతహలాడుతున్నారు.