అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రముఖులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తోనూ మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మస్క్ పిల్లలకు మోదీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. చిన్నారులకు ప్రధాని మోదీ కొన్ని పుస్తకాలు బహుమతిగా అందించారు. వాటిలో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘‘ది క్రెసెంట్ మూన్’’, విష్ణుశర్మ రచించిన పంచతంత్ర, ఆర్‌కే నారాయణ్ పుస్తకాలు ఉండటం విశేషం.
మస్క్- మోదీ భేటీ సమయంలో ఓ మహిళ కూడా పాల్గొన్నట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆమె శివన్ జిలిస్ . ప్రస్తుతం మస్క్ భాగస్వామిగా ఆమెను పేర్కొంటున్నారు. మస్క్‌కు చెందిన బ్రెయిన్ చిప్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్‌లో శివన్ జిలిస్ ఉన్నతస్థాయి ఉద్యోగిగా ఉన్నారు. కెనడా లో పుట్టిన శివన్ జిలిస్ , యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె తల్లి భారతీయ సంతతి వ్యక్తి. తల్లిపేరు శారద, తండ్రి పేరు రిచర్డ్ జిలిస్. కెనడాలో జన్మించిన శివన్, యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తల్లి భారతీయ సంతతి వ్యక్తి. ఆమె పేరు ఎన్ శారద. శివన్ జిలిస్ తండ్రి పేరు రిచర్డ్ జిలిస్.
న్యూరాలింక్ కంపెనీలో ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శివన్ జిలిస్ పనిచేసింది. 2017 నుంచి 2019 వరకు టెస్లా కంపెనీ ప్రాజెక్టు డైరెక్టర్‌గాను ఆమె పనిచేశారు. మస్క్- జిలిస్ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2021లో ఇద్దరు, 2024లో మూడో బిడ్డకు జన్మనిచ్చారు. మస్క్ కు మొత్తం 11 మంది సంతానం.