ఆదాయ పన్ను 2025 బిల్లు ముసాయిదాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , లోక్ సభలో గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. హౌజ్ కమిటీకి బిల్లును సిఫారసు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను నిర్మలా సీతారామన్ కోరారు. మంత్రి వినతిని అంగీకరించినట్లు స్పీకర్ తెలిపారు.
కొత్త ఆదాయ పన్ను బిల్లు ముసాయిదాను వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్షాలు తెలిపాయి. మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానాన్ని ఆమోదించారు. హౌజ్ సెలెక్ట్ కమిటీకి ఆదాయ పన్ను ముసాయిదా తీర్మానాన్ని రిఫర్ చేయాలని మంత్రి సీతారామన్ కోరారు.
వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనుంది. చాలా సరళమైన రీతిలో పన్ను బిల్లు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.