ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం ఉదయం 21 లక్షల మందికిపైగా నదీ స్నానాలు చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నాడు రెండు కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.
జనవరి 13 నుంచి ఇప్పటి నేటి వరకూ 48.25 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పాల్గొన్నారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ జరగనుంది. దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వే సింది.
శివరాత్రి రోజు సుమారు 5 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన యూపీ సర్కార్ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.