ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్ళారు. వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన మోదీకి యూఎస్ మిలిటరీతో పాటు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. తీవ్రమైన చలిలో కూడా ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి చేరుకుని మోదీకి స్వాగతం పలికారు. ప్లకార్డులు చేతబట్టి ఘనంగా ఆహ్వానించారు. బ్లెయిర్ హౌస్ లో భారతీయులతో మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అంటూ మోదీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. భారత్-యూఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడం తమ లక్ష్యం అని పేర్కొన్నారు.
యూఎస్ఏ డైరక్టర్ ఆఫ్ నేషన్ ఇంటలిజెన్స్ తులసీ గబార్డ్, మోదీ తో సమావేశమై చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు కాంగ్రెస్ చట్టసభ సభ్యులు, పలువురు ప్రముఖులతో మోదీ సమావేశంకానున్నారు.