గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపుల కేసు లో భాగంగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో వంశీ సహా 88 మందిపై కేసు నమోదైంది.
TDP కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో కేసు నమోదైంది. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్టు సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేశాడు. అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సత్యవర్ధన్ ఫిర్యాదుతో 140 (1), 308, 351 (3), రెడ్‌విత్ 3(5) సెక్షన కింద మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు.
వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసులు కూడా నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. అరెస్టు విషయమై వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించడంతో పాటు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వంశీని పోలీసులు తరలిస్తున్నారు.