విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లక్ష్యంగా దాడి చేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న విమానం లక్ష్యంగా ఉగ్రదాడి జరగవచ్చు అని ఓ అగంతకుడు ఫోన్ చేసి హెచ్చరించాడు.
ఫిబ్రవరి 11న ముంబై పోలీసులకు కాల్ వచ్చింది. ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఆ వార్నింగ్ కాల్ రాగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంటనే ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సదరు వ్యక్తి మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు గుర్తించామని ముంబై పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుంచి అమెరికా వెళతారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ తో సమావేశం అవుతారు.