చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తాయి. నిందితుడి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ మణికొండలో నివాస ఉంటున్నాడు . 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరిట ‘రామరాజ్యం’ ఆర్మీ ఏర్పాటుకు సోషల్ మీడియాలో ప్రకటన జారీ చేశాడు. అంతకు ముందు శ్రీరాముడి వంశస్తులు, గోత్రీకుల వివరాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లోని అర్చకులకు హుకుం జారీ చేశాడు. గోత్రాలు మారిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు.
జిల్లా కలెక్టర్ ను అదుపులోకి తీసుకున్నాం వచ్చి విడుపించుకోండి అంటూ పోలీసులకు ఫోన్ చేసినట్లుగా కూడా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. తన ఆర్మీలో చేరాలనుకునేవారికి కొన్ని అర్హతలు కూడా విధించాడు . అభ్యర్థులు 20-50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వాు అయి ఉంది. 5 కిలోమీటర్ల దూరం నడవగల్గాలని, రెండు కిలోమీటర్లు పరిగెత్తాలని తెలిపాడు.
అలాగే కనీస విద్యార్హత పదో తరగతి అయి ఉండాలని చెప్పి రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో సభ్యుడి నుంచి రూ.350 వసూలు చేశాడు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల జీతం, వసతి సదుపాయం కల్పిస్తానని ప్రకటనలో తెలిపాడు. ఆర్మీ నిర్వహణకు డొనేషన్లు స్వీకరించే ప్రక్రియలో భాగంగా తనవంతుగా రూ.1,20,599 అందజేశాడు.
తొలుత 24 మందితో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకుని తణుకులో సమావేశం నిర్వహించాడు. ఆ తర్వాత కోటప్పకొండకు వచ్చి స్థానిక దర్జీ ద్వారా యూనిఫాంలు కుట్టించుకున్నారు. ఈ నెల 2న హైదరాబాద్‌లోని యాప్రాల్‌లో ఒక ఇంట్లో సమావేశమై సంస్థ బ్యానర్ ఆవిష్కరించాడు. మూడు వాహనాల్లో 7న చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకుని దాడికి పాల్పడ్డాడు.