మేడారంలో చిన్నజాతర ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మలకు ప్రతీ రెండేళ్ళకు ఓ మారు జాతర నిర్వహిస్తారు. మధ్య ఏడాదిలో నిర్వహించే పండుగను చిన్న జాతర అంటారు. నేటి నుంచి అమ్మవార్ల జాతర 15వ తేదీ వరకు కొనసాగుతుంది. పెద్ద జాతరకు వివిధ కారణాలతో రాలేకపోయినవారు ఈ నాలుగు రోజుల పాటు అమ్మవారిని సేవించి తరిస్తారు. పున్నమి వెలుగుల్లో పూజారులు జాగరం చేస్తారు.
నేడు మండమెలిగె క్రతువుతో జాతర ప్రారంభవుతౌంది. శుక్రవారం నాడు భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్న జాతర నిర్వహణ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం
ప్రభుత్వం 5.3 కోట్ల రూపాయలు కేటాయించింది. దాదాపు 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు తరలిరానున్నారు. వీరి కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మేడారం ప్రాంతం భక్తులతో కళకళలాడుతోంది.