అమెరికా బాటలో బ్రిటన్ కూడా అక్రమ వలసదారులపై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్రమ వలసదారుల ఏరివేత ప్రారంభించారు. భారత్ నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన 104 మందిని సైనిక విమానంలో తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రిటన్ కూడా అక్రమ వలసదారుల ఏరివేత ప్రారంభించింది. దేశంలోకి అక్రమ వలసలు పెరిగాయని, దీని వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారులను ఏరివేస్తామని హెచ్చరించారు.
ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు పెరిగాయి. కొందరు ఏజంట్లు వలసదారులను బ్రిటన్ తరలిస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు ఇంగ్లిష్ ఛానల్ ఈదుకుంటూ ప్రమాదకర మార్గాల్లో బ్రిటన్లోకి ప్రవేశించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అక్రమ పద్దతుల్లో బ్రిటన్ చేరుకున్న వారిలో భారీతీయులను కూడా గుర్తించారు. వారిని ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించనున్నారు.
అక్రమ వలసదారులపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరగనుంది. ఉద్యోగాల ఆశ చూపి ఏజంట్లు, నేరగాళ్లు వలసదారులను అక్రమంగా బ్రిటన్ తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తున్నారు. వారిని వారి దేశాలకు తరలించే విషయంపై పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.