ఆధునిక కాలంలో వివాదాలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు:
చారిత్రకంగానూ, చట్టపరంగానూ ఆ కొండ హిందువులదే అని ఇంత వివరంగా తెలుస్తున్నా, తిరుప్పరంకుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటి వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది సుస్పష్టం. 1931లో ప్రీవీ కౌన్సిల్ ఇచ్చిన తీర్పును ఇటీవల ఒక ప్రఖ్యాత ఆలయ కార్యకర్త ప్రస్తావిస్తూ, ఆ కొండ మీద హిందువుల హక్కులను పరిరక్షించడంలో తమిళనాడు హిందూ మత ధార్మిక ఎండోమెంట్స్ విభాగం ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. ఎక్స్ సామాజిక మాధ్యమంలో విస్తృత ప్రజాదరణ పొందిన ఒక ట్వీట్‌లో ఆ కార్యకర్త, తిరుపరంకుండ్రం కొండ విషయంలో ప్రార్థనా స్థలాల చట్టం సెక్షన్ 3,4 లను వర్తింపజేయాలని పిలుపునిచ్చారు. ధార్మిక ప్రదేశాల స్వరూపాన్ని మార్చకూడదని ఆ చట్టం చెబుతుంది.
ది హిందూ పత్రికకు చెందిన జర్నలిస్టు డి సురేష్ కుమార్ ఇలా రాసుకొచ్చారు. ‘‘తిరుపరంకుండ్రం కొండ మీద కొన్ని ప్రదేశాలపై తమ ప్రత్యేక యాజమాన్య హక్కులను స్థిరం చేసుకోడానికి కొన్ని ముస్లిం వర్గాలు పట్టు పడుతున్నాయి, దాని కారణంగా 110ఏళ్ళ తర్వాత మళ్ళీ వివాదం తలెత్తింది. ముస్లిం వర్గాల ప్రకటనలను హిందూ సంస్థలు చాలా పట్టుదలతో ఎదుర్కొంటున్నాయి. తమ మత సంస్కృతి మీద ముస్లిములు నేరుగా చేస్తున్న దాడిగా హిందూ సంస్థలు భావిస్తున్నాయి.’’
హిందువుల మనోభావాలు – ప్రభుత్వం నిష్క్రియాపరత్వం:
తమిళనాడు పర్యాటక శాఖకు చెందిన తాజా ప్రకటనలో కూడా తిరుపరంకుండ్రం కొండ మీద దర్గా ఉందని ఎలాంటి ప్రస్తావనా చేయలేదు. తద్వారా ఆ స్థలంలో ఇస్లామిక్ దర్గా గురించి అధికారిక చారిత్రక ఆధారాలు ఏమీ లేవని ధ్రువీకరణ అయింది. అయినా, హిందూ ఆలయాల ఆస్తుల ఆక్రమణల విషయంలో తమిళనాడు ప్రభుత్వం, ఎండోమెంట్స్ శాఖ చేష్టలుడిగి చూస్తున్నాయి.
ముందుముందు పరిస్థితి ఏమిటి?
తమిళనాడులోని ముస్లిములు ఉద్దేశపూర్వకంగా తిరుపరంకుండ్రం కొండ అంశం మీద రోజురోజుకూ వివాదాలు సృష్టిస్తున్నారు. వారి లక్ష్యం ఒకటే. హిందువుల పుణ్యక్షేత్రాన్ని వారికి కానీయకుండా చేయడమే. ఆ విషయంలో రాజకీయ పార్టీలేవీ తమకు అడ్డు రావని వారికి బాగా తెలుసు.
అధికార డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ. ముస్లిం పార్టీ అయిన ఎస్‌డిపిఐకి అన్నాడీఎంకే మిత్రపక్షం. ఇతర రాజకీయ పార్టీలైన ఎన్‌టీకే, టీవీకే కూడా ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ముస్లిములకు గుడ్డిగా మద్దతు పలుకుతాయి. అలా హిందువుల న్యాయబద్ధమైన హక్కుల విషయంలో వారికి సాయం చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాదు. ఆ ధైర్యంతోనే వారు తిరుపరంకుండ్రం కొండను ‘సికందర్ మలై’గా మార్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మెల్లమెల్లగా ఆ వివాదం అయోధ్య రామజన్మభూమి, మథుర కృష్ణజన్మభూమి లేదా కాశీ విశ్వనాథ దేవాలయాల వివాదాల్లా పీటముడి పడాలని వారి కోరిక.
ఇప్పుడు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నందున, చట్టపరమైన స్పష్టత కోసం హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. 1931లో ప్రీవీకౌన్సిల్ చెప్పిన తీర్పు ఆధారంగా తిరుపరంకుండ్రం కొండ మొత్తాన్నీ దేవాలయ ఆస్తిగా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రమంతటా రాజకీయ ప్రేరేపణలతో జరుగుతున్న ఆక్రమణల వల్ల ప్రాచీన దేవాలయాలకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల సాంస్కృతిక కేంద్రాల పరిరక్షణ కోసం పిలుపునిచ్చాయి.
తాజా వివాదం నేపథ్యంలో హిందువుల్లో ఆందోళన:
బ్రిటిష్ వారి కాలంలోనే అప్పటి అత్యున్నత న్యాయస్థానం విస్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ, తిరుపరంకుండ్రం కొండ గురించి ఇటీవల మళ్ళీ వివాదం చేస్తున్నారు. కొన్ని ముస్లిం వర్గాలు ఆ కొండ మీద యాజమాన్య హక్కులు తమవేనంటూ రచ్చ చేస్తున్నారు. దాంతో హిందూ కార్యకర్తలు, భక్తులు ఆందోళన చెందుతున్నారు.
హిందూ వర్గాలు ఇప్పుడు కోరుతున్నది ఒకటే. 1931లో ప్రీవీకౌన్సిల్ ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. దేవాలయం మీద యాజమాన్యం హిందువులదేనని స్పష్టం చేయాలి. రాజకీయ ప్రేరేపణలతో చరిత్రను వక్రీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను నిలువరించాలి.
మదురై నియోజకవర్గ ఎంపీ సు వెంకటేశన్ సిపిఐ(ఎం) పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన కావల్ కొట్టం అనే నవల రాసారు. దానికి 2011లో సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా లభించింది. ఆ రచనలో మదురైలో సుల్తాన్ సికందర్ సాధారణ ప్రజల మీద చేసిన దాష్టీకాలను, అతన్ని నాయక రాజులు ఓడించిన విధానాన్నీ వివరించారు. దాన్నిబట్టే తిరుపరంకుండ్రం కొండ మీద ముస్లిముల దర్గా, మసీదు ఎలా వచ్చాయో అర్ధమవుతోంది. నిజానికి అది హిందువుల ఆస్తేననీ, తిరుపరంకుండ్రం కొండ మీద యాజమాన్య హక్కులు హిందువులవేననీ స్పష్టమవుతోంది. దాన్ని ఆచరణలోకి తీసుకురావాలన్నదే హిందువుల ఆవేదన.