రోహిత శర్మ సెంచరీ …గిల్ అర్ధ శతకం
సిరీస్ గెలిచిన భారత్
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. నేడు కటక్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ అద్భుతంగా లక్ష్యఛేదన చేసి విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి భారత్ ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ (69), బెన్ డకెట్( 65), లియామ్ లివింగ్ స్టన్ (41) రాణించగా, కెప్టెన్ జోస్ బట్లర్ (34), హ్యారీ బ్రూక్( 31), ఫిల్ సాల్ట్( 26) ఫరవాలేదు అనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ , హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా , వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు.
భారత్ 305 పరుగుల భారీ లక్ష్యాన్ని 44.3 ఓవర్లలో సాధించింది. రోహిత్ సెంచరీ చేయగా గిల్ అర్ధశతకం చేయడంతో విజయం సునాయసంగా మారింది. అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ 76 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.రోహిత్ శర్మకు వన్డేల్లో ఇప్పటివరకు 32 సెంచరీలు చేశాడు. 90 బంతులు ఎదుర్కొని 119 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ రెండ వికెట్లు తీయగా, ఆట్కిన్‌సన్, రషీద్, లివింగ్‌స్టన్ తలో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.