దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సీఎం పదవి అతిషి రాజీనామా చేశారు. నేటి ఉదయం దిల్లీ రాజ్ నివాస్ కు వెళ్లిన అతిషి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాజీనామా లేఖ అందజేశారు.
శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి ఘోరంగా ఓడింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 48 స్థానాల్లో బీజేపీ గెలవగా ఆప్ 22 స్థానాలకు పరిమితమైంది. దీంతో అతిషి, సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ కు లేఖ అందజేశారు.
లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా గత ఏడాది సెప్టెంబర్లో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అతిషికి సీఎం పదవి కట్టబెట్టారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ .విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.