ఇంజనీరింగ్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. నందిగామ సమీపంలోని ఓ ఇంజీనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ కంచికచర్లలో హాస్టళ్లో ఉంటోన్న యువతికి గాలి సైదా వల వేశాడు. మాయమాటలు చెప్పి నగ్న ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గాలి సైదా అత్యాచారం చేసి, ఫోటోలను స్నేహితులకు పంపించాడు. ఆ ఫోటోలు చూపి వారు కూడా యువతిపై వేధింపులకు పాల్పడటంతో ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ చవాన్ వెల్లడించారు.
గాలి సైదా అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తోంది. యువతులకు గాలం వేసి వారిపై లైంగిక దాడులకు దిగుతున్నట్లు సమాచారం. అయితే యువతులు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారని స్థానికుల ద్వారా తెలుస్తోంది.