ప్రస్తుత ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకురానుంది. వచ్చే వారం ఈ ప్రక్రియను ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుత ఆదాయపు పన్ను విధానం సరళీకరణ, పన్ను విధానాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడనుంది. అదనపు పన్ను భారమేమీ మోపడంలేదు..
ఎగువసభలో ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేబినెట్ ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది.
పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేసిన తర్వాత బిల్లు మళ్లీ కేబినెట్‌కు వెళ్తుంది.మంత్రివర్గం ఆమోదం తర్వాత మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిశ్రమకు అవసరమైన విధంగా సుంకాల రక్షణను అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.