సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్ సముద్రం పరిధిలో భారీ భూప్రకంపనలు ఏర్పడ్డాయి. హోండురస్‌కు ఉత్తర దిశలో శనివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ (USGS) తెలిపింది.
కెమెన్ దీవుల తీరానికి 209 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు చోటుచేసుకోగా భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు ఏర్పడ్డాయి. సునామీ హెచ్చరికలు జారీ చేసి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఏజీన్సీ సూచించింది.
కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, హోండురస్, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై కూడా భూప్రకంపనలు ప్రభావం చూపాయి. సునామీ అలాలు క్యూబా తీరాన్ని తాకే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
కెమెన్ ఐలాండ్స్, జమైకా, క్యూబా, మెక్సికో, హోండురస్, బహమాస్, బెలిజ్, హైతి, కోస్టారికా, పనామా, నికరాగువా, గ్వాటేమాలా తీరాల్లో సునామీ ప్రభావం ఉండవచ్చు అని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.