ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటారు. బీజేపీ సంపూర్ణ విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 48 సీట్లు కౌవశం చేసుకుంది. అధికార ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఘోర పరాజయం పొందారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ 4 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ కేజ్రీవాల్‌పై విజయం సాధించారు. ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జంగ్‌పుర స్థానంలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఇక్కడ 600 ఓట్ల మెజారిటీ సాధించారు.
షకుర్ బస్తీ నియోజకవర్గంలో సత్యేందర్ జైన్ బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి 19 వేల మెజారిటీ సాధించారు.
ఢిల్లీ సీఎం అతీశీ విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గంలో ఆమె బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై 900 ఓట్ల మెజారిటీ సాధించారు.మొదటి రౌండ్ నుంచి వెనుకబడ్డ అతీశీ అనూహ్యంగా చివరి రౌండులో గెలుపొందారు.