దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారైంది. దేశ రాజధానిలో 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ సమయంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. దిల్లీ సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఆప్ ఓటమి ఖాయం కావడంతో సెక్రటేరియట్ లోని కీలక ఫైళ్లు తరలిపోకుండా ఉండేందుకు ఆయన ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
గడిచిన పదేళ్లుగా పాలకపార్టీ ఉన్న ఆప్ పై బీజేపీ అనేక అవినీతి ఆరోపణలు చేసింది. తమకు దిల్లీలో అధికారమిస్తే కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని గతంలో ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం కావడంతో అందుకు తగినట్టుగా బీజేపీ సిద్ధం అవుతోంంది.