దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెల్లడయ్యాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పక్షంగా అవతరించింది.
అయితే బీజేపీ తరఫున దిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. బీజేపీ దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా, ఎంపీ మనోజ్ తివారీ, పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి కూడా సీఎం రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవా, పర్వేశ్ వర్మలలో ఒకరిని ముఖ్యమంత్రిగా మిగతా ఇద్దరినీ డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 36 సీట్లు కాగా బీజేపీ ప్రస్తుతం 47 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆప్ 23 స్థానాలకు పరిమితం అయింది.