దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి ఖరారైంది. న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఓడారు. ఓడించారు. 3 వేల పైచిలుకు ఓట్లతో పర్వేశ్ గెలుపొందారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా కూడా పరాజయం చెందారు. జంగ్ పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓడారు. అవినీతి కేసుల్లో సిసోడియా జైలు జీవితం కూడా గడిపారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్, సిసోడియాపై గెలిచారు.
కోండ్లి నియోజకవర్గంలో తొలి ఫలితంగా వెల్లడి కాగా అక్కడ ఆప్ విజయం సాధించింది. ఆప్ తరఫున పోటీకి దిగిన దీప్ కుమార్, బీజీపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై కుల్ దీప్ 6,293 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. లక్ష్మీనగర్ నియోజకవర్గంలో అభయ్ వర్మ బీజేపీ తరఫున విజయం సాధించారు.