మస్తాన్ అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం కేసుతోపాటు, లావణ్యతో గడిపిన వీడియోలతో పట్టుబడ్డ మస్తాన్ అరాచకాల్లో ఏపీకి చెందిన అదనపు ఎస్పీ లీలలు కూడా వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ పోలీసులు మస్తాన్‌ను అరెస్ట్ చేసి అతని ఫోన్, కంప్యూటర్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నాయి. అతని ఫోన్లో 200పైగా వీడియోలు, వందలాది ఫోటోలను తెలంగాణ పోలీసులు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన పోలీస్ అధికారితో లావణ్య సన్నిహితంగా మెలిగిన ఫోటోలు లభించాయి. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
శేఖర్ బాషా వ్యవహారంలో మస్తాన్ స్వయంగా లావణ్యకు ఏపీ పోలీస్ అధికారిని పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఆ తరవాత లావణ్యకు పోలీస్ అధికారి చేసిన వాట్సాప్ చాట్, ఆమెతో దిగిన ఫోటోలు సంచలనంగా మారాయి. దీంతో ఆ పోలీస్ అధికారిపై వేటు వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది.
మస్తాన్ #mastansai వీడియోలు, ఫోటోలను విశ్లేషిస్తున్న కొద్దీ అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. వందలాది మంది హిందూ యువతులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి, వారిపై లైంగిక దాడులు చేయడంతోపాటు, ఆ సమయంలో వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసే వాడని పోలీసులు గుర్తించారు. అతనిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.