ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్ టూర్
12, 13 తేదీల్లో అమెరికాలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10 నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్‌లో, 12 నుంచి 13 వరకు అమెరికాలో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
ప్యారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10న ఆ దేశానికి పయనం అవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో సమావేశమై చర్చలు జరుపుతారు. వహిస్తారు. ఆ తర్వాత అక్కడి న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధానమంత్రి పరిశీలిస్తారు.
ఫిబ్రవరి 12 సాయంత్రం ఫ్రాన్స్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. 13నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారు.