ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి. కౌటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. బీజేపీ, ఆప్ హోరా హోరీగా తలపడుతున్నాయి. అయితే బీజేపీ 39 స్థానాల్లో మెజారిటీలో ఉంది. ఆప్ 30 స్థానాల్లో మెజారిటీలో ఉంది.70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. మధ్యాహ్నం తరవాత కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.
ఢిల్లీ సీఎం ఆప్ అభ్యర్థి అతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
దాదాపు 27 సంవత్సరాల తరవాత ఢిల్లీలో బీజేపీ విజయం దిశగా దూసుకెళుతోంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారం చేసిన నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థిపై పరవేశ్ సింగ్ వర్మపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆప్ కీలక నేత ఢిల్లీ లిక్కర్ స్కాంలో తిహార్ జైలు జీవితం గడిపిన మాజీ మంత్రి సిసోదియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖరారైంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.