కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సహా ఇతర రాజకీయపార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన సూచనలపై త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు విధానపరమైన అంశాలతో కూడిన సమాధానాన్ని కమిషన్ అందజేస్తుందని తెలిపింది.
ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్నారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు ఒక జట్టుగా ఏర్పడి ఓటర్ల సంఖ్యపై అధ్యయనం చేస్తున్నాయన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించారని, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ఉన్నప్పటికీ ఓటర్లను మరో కేంద్రానికి ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలను తమకు ఇవ్వాలని ఈసీని కోరారు.
రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ, త్వరలో సమాధానం ఇస్తామని తెలిపింది.