యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
తమది సింధ్ ప్రావిన్స్ అని జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ పవిత్ర సందర్భాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో భారత్ కు వచ్చినట్లు తెలిపారు. కుంభమేళా ద్వారా హిందు మతం గొప్పతనాన్ని తొలిసారిగా మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం దక్కిందన్నారు. హరిద్వార్ లో తమ పూర్వీకుల అస్థికల్ని గంగలో కలిపామన్నారు.
ప్రయాగ్ రాజ్ లో ఇప్పటికే 40 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది. మరో పదికోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా.