అమెరికాలో చదువు కోసం వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి జీవితం విషాదంతంగా ముగిసింది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్ లో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని చాలించాడు.
సాయి ఫోన్ లాక్ చేసి ఉండటంతో అధికారులు సమాచారాన్ని మీడియాకు తెలిపారు. సాయికుమార్ రెడ్డి చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే కారణాలు వెల్లడికావాల్సి ఉంది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయి. పార్ట్ టైమ్ జాబ్ మీద ఆధారపడే వారి పరిస్థితి దయనీయంగా మారింది.ఆదాయం లేకపోవడంతో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించేందుకు ఇబ్బందిపడుతూ ఒత్తిడి గురవుతున్నారు.