ఆర్థిక మోసాలు అరికట్టడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుంచి బ్యాంక్.ఇన్ గా ఉండాలని నాన్ బ్యాంకింగ్ సంస్థలకైతే ఫిన్.ఇన్ డొమైన్ ఉండాలని తెలిపింది.
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఏప్రిల్ నుంచి బ్యాంక్.ఇన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి ఆ తర్వాత ఫిన్.ఇన్ రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నట్లు వివరించారు. ఐడీఆర్‌బీటీ ఈ ప్రక్రియకు రిజిస్ట్రార్‌గా వ్యవహరించనుంది.
దేశంలో జారీ చేసిన కార్డుల ద్వారా ఇతర దేశాలలో జరిగే లావాదేవీలకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA)ను జోడించనున్నట్లు కూడా గవర్నర్ తెలిపారు.