తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు రద్దు, ఇటీవల తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలంటూ భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై విచారణ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం #supremecourt రామచంద్రయాదవ్ వేసిన పిటిషన్ తిరస్కరించాయి. దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది.