కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌కు సియాల్దాకోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీనిపై సీబీఐ వేసిన పిటిషన్ విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. దోషి సంజయ్ రాయ్‌కు స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాధితురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. బెంగాల్ కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
దోషి సంజయ్ రాయ్‌కు కేవలం జీవిత ఖైదు విధించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీబీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్ పోలీసులు కేసు విచారణ జరిపి ఉంటే దోషికి ఉరిశిక్ష పడేదని ఆమె అన్నారు. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
డాక్టర్ హత్యాచారం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న సంజయ్ రాయ్ కేసుపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు బాధితురాలి తల్లిదండ్రులకు మాత్రమే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.