ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. శైలజానాథ్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆహ్వానించారు. జగన్ నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా శైలజానాథ్ చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజల తరపున వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు.
ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి శైలజానాథ్ ప్రాతినిధ్యం వహించారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.