రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ తరవాత మొదటిసారి వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇవాళ సమావేశమైన ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డ్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం వెలువరించింది. రెపో రేటు 0.25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించారు. రెండేళ్లలో వడ్డీ రేట్లు తగ్గించడం ఇదే మొదటి సారి. 2023 మే నుంచి వడ్డీ రేట్లు సవరించలేదు. ఐదేళ్ల తరవాత వడ్డీ రేటు 6.25 శాతానికి దిగివచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారి వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా స్పల్పంగా తగ్గనున్నాయి. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.