నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ కేసులో సాక్షిగా వున్న సోనూసూద్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
పంజాబ్‌లోని లూథియానా కోర్టు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచాలని ముంబై అందేరి వెస్ట్ ఒషివారా పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
లూథియానాకు చెందిన లాయర్ రాజేశ్ ఖన్నా, తనను మోహిత్ వర్మ రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశాడు. రిజికా కాయిన్ పేరుతో పెట్టుబడి పెట్టించినట్లు కేసు నమోదు చేశాడు. ఈ కేసులో సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నాడు. పలుమార్లు కేసు విచారణకు హాజరు కావాలని సోనూసూద్‌కు నోటీసులు పంపినా హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈకేసు ఫిబ్రవరి 10న మరోసారి విచారణకు రానుంది.
సోనూసూద్ అనేక హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లోప్రతినాయకుడిగా నటించారు. కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలకు మంచి గుర్తింపు లభించింది. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ఫతేహ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.