రాజమండ్రి-విజయవాడ మధ్య కూడా ప్రయాణానికి అంతరాయం
ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైళ్లను 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 201 వరకు కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైలు సర్వీసులు రద్దు చేశారు. మరో 9 రైళ్లను దారి మళ్లించారు. గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు11 రోజులపాటు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు.
గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12705/12706)ను 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో.. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (1713/12714)ను 11, 14, 16, 18, 19, 20, తేదీల్లో రద్దు చేశారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం స్టేషన్ల మధ్య పరుగులు తీసే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20834) 19, 20 తేదీల్లో 75 నిమిషాలు, ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17406) 9, 11, 14, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
నూజివీడు-వాల్తేరు-ఏలూరు స్టేషన్ల పరిధిలో కూడా ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఫిబ్రవరి 8న ఆరు సర్వీసులు రద్దు చేశారు. మరో 13 రైళ్లను ఫిబ్రవరి,7,8న రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో తెలిపారు.