చంద్రబాబు ఎన్డీయే చైర్మన్ పదవి అడిగారన్న దేవెగౌడ
అలాంటి చర్చే జరగలేదని బీజేపీ చీఫ్ స్పష్టత
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీయే చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవిని ఆశించారని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాఖండించారు. ఎన్నికల ముందు కానీ తర్వాత గానీ అలాంటి చర్చే జరగలేదన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు అందరూ సుముఖత తెలిపారన్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీయే చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఆశించారని , అందుకు మోదీ నిరాకరించారని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ నిన్న రాజ్యసభలో వ్యాఖ్యానించారు.
రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం, పీఎంగా పనిచేసిన మోదీకి ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలుసు కాబట్టే చంద్రబాబు ప్రతిపాదనను ఆయన తిరస్కరించారన్నారు. దేశంలోనే మోదీ గొప్ప నేత అంటూ దేవెగౌడ ప్రశంసించారు.