ఏపీ ప్రభుత్వం వాట్సప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింద. వాట్సప్ నంబరు 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్ గవర్నెన్స్‌లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్‌టికెట్లు ఆపేయడం లాంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తోంది.
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్ నంబరు 9552300009 ద్వారా వారంతా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. త్వరలో పదో తరగతి విద్యార్థులకూ ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడిట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.