దేశంలో ఈవీ వాహనాల హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్స్ ఇండియా సంస్థ ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈటీవో మోటార్స్‌తో కలసి ఫ్లెక్స్ ఇండియా ఈ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. నాలుగు వారాలపాటు ఒక్కో టికెట్ రూ.99కే విక్రయించనున్నారు. ఈ సేవలను తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కాకతీయ హోటల్ నుంచి ప్రారంభించారు.
వచ్చే వారంలో విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య ఫెక్స్ ఇండియా ఈవీ బస్సు సేవలు ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ తెలిపారు. ఈ బస్సులో 49 సీట్లు అందుబాటులో ఉంటాయి. రాబోయే కొద్ది రోజుల్లో స్లీపర్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒక్క ఛార్జితో 600 కి.మీ మైలేజీ ఇచ్చే ఈవీ బస్సులను ఈటీవో తయారు చేసింది. ప్రయోగాత్మకంగా ప్రధాన నగరాల మధ్య సేవలను ప్రారంభిస్తున్నారు. తరవాత మరిన్ని నగరాలకు ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు 2 వేల ఈవీ #evbus బస్సును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.