ఏపీ మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్ మొదటి ర్యాంకు సాధించారు. సీఎం చంద్రబాబునాయుడు 6వ ర్యాంకులో నిలిచారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని సీఎం మంత్రులను ఆదేశించారు.
దస్త్రాల క్లియర్ చేయడంలో కందుల దుర్గేశ్ రెండో స్థానం, కొండపల్లి శ్రీనివాస్ మూడో స్థానం, నాదెండ్ల మనోహర్ నాలుగో స్థానంలో నిలిచారు. తరవాత డోలా బాలవీరాంజనేయస్వామి, ఏడో స్థానంలో సత్యకుమార్, ఎనిమిదిలో నారా లోకేశ్, 9వ స్థానంలో కొల్లు రవీంద్ర నిలిచారు.
13వ స్థానంలో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, 14లో మంత్రి నారాయణ, 15లో టీజీ భరత్ 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి, 17లో అచ్చెన్నాయుడు నిలిచారు. 18లో రాంప్రసాద్ రెడ్డి, 19లో గుమ్మడి సంధ్యారాణి, 20లో వంగలపూడి అనిత, 21లో అనగాని సత్యప్రసాద్,22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23లో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో పయ్యావుల కేశవ్, 25లో వాసంశెట్టి నిలిచారు.
మంత్రులు పనితీరు మెరుగు పరచుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని సూచించారు.