పది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన ఇంగ్లండ్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత్ ముందు 249 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ పదివికెట్ల నష్టానికి 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ తరఫున హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ వన్డేల్లో అరంగేట్రం చేశారు. మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లీ కి విశ్రాంతి ప్రకటించారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఇలా…
ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 26 బంతుల్లో 43 పరుగులు చేసి మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ వేగంగా కచ్చితమైన త్రో వేసి ఫిల్ సాల్ట్ ను వెనక్కిపంపాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (32)ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. ఆ తర్వాత హ్యార్ బ్రూక్( 0) ను వెనక్కి పంపాడు. ఆతర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జో రూట్ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 162గా ఉంది.
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (52) వెనుదిరగడంతో 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ ఐదు వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది. ఆ తర్వాత 183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ (5) ఔటయ్యాడు.
ఏడో వికెట్ గా బ్రైడన్ కార్సే ఔట్ అయ్యాడు. దీంతో 206 పరుగులు వద్ద ఏడో వికెట్ నష్టపోయిన ఇంగ్లండ్ 220 పరుగులు వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జాకోబ్ బెథిల్ 64 బంతులు ఆడి 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 45 ఓవర్లకు 236 పరుగులు చేసింది.
9, 10వికెట్లుగా గా ఆదిల్ రషీద్ ( 8), సాకిబ్ మహమూద్ (2 ) వెనుదిరిగారు. జోఫ్రా ఆర్చర్ (21) నాటౌట్ గా మిగిలిపోయాడు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్, అక్షర్ పటేల్, షమీ తలా ఒక వికెట్ తీశారు.