అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటోన్న 104 మంది వలసదారుల తరలింపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియేనని ఆయన లోక్‌సభలో చెప్పారు. 2012 నుంచి ఈ విధానం కొనసాగుతోందన్నారు. 2012లో 512 మంది, 2019లో 2 వేల మందిని తరలించినట్లు గుర్తుచేశారు. విదేశాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు.
భారత అక్రమ వలసదారులను తరలించడంపై అమెరికా స్పందించింది. తాజాగా 104 మంది అక్రమ వలసదారులను సీ 17 సైనిక విమానంలో అమృత్‌సర్ విమానాశ్రయంలో దింపిన సంగతి తెలిసిందే. అమెరికాలో చట్టాలను అమలు చేసి ప్రజలను రక్షించాల్సి బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ అక్రమ వలసదారులకు బేడీలు వేసి తరలించిన విషయంపై మాత్రం స్పందించలేదు.
అమెరికాలో 18 వేల మంది భారతీయులు అక్రమంగా నివాసం ఉంటున్నారని విదేశాంగశాఖ ప్రకటించింది. అయితే ఈ సంఖ్య 7 లక్షల దాకా ఉండవచ్చని అంచనా. లక్షలాది మంది ఉన్నత విద్యపేరుతో అమెరికాకు చేరి అక్కడ చదువు పూర్తయిన తరవాత స్వదేశానికి తిరిగిరావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి బలవంతంగా తరలించేందుకు ట్రంప్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.