భారత సైన్యపు తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం అయిన కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం పేరు ‘విజయ్ దుర్గ్’గా మారింది. దాని గేట్లలో ఒకటైన సెయింట్ జార్జ్ గేట్ పేరును శివాజీ గేట్‌గా మార్చారు. ఆ విషయాన్ని అధికారులు బుధవారం అధికారికంగా వెల్లడించారు.
ఫోర్ట్ విలియం పేరు భారతీయమైన పేరుగా మార్చాలన్న నిర్ణయం 2024 డిసెంబర్‌లో తీసుకున్నారు. కోల్‌కతాలోని ఆ కోటను బ్రిటిష్ వారు 1781లో కింగ్ విలియమ్ 2 పేరుమీద నిర్మించారు. కోట నిర్మాణంలో ఇటుకలు, మోర్టార్ వినియోగించారు. ఆ కోటలో చౌరంఘీ, ప్లాసీ, కలకత్తా, వాటర్‌గేట్, ట్రెజరీ గేట్, సెయింట్ జార్జ్ గేట్ అనే పేరున్న ఆరు ద్వారాలు ఉన్నాయి.
దేశానికి స్వతంత్రం వచ్చాక ఫోర్ట్ విలియం నియంత్రణ భారత సైన్యం చేతికి వచ్చింది. భారత సైన్యం ఆ కోటలో బోలెడన్ని మార్పుచేర్పులు చేపట్టింది, నిర్మాణాలు చేసింది. ఇప్పుడు ఆ కోట పేరును, కోటలో ఒక ద్వారం పేరునూ మార్చడం భారతదేశపు సొంత సైనిక వారసత్వానికి గుర్తింపుగా పరిగణించవచ్చునని భారత ప్రభుత్వం ప్రకటించింది.