కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) ద్వారా లబ్దిపొందుతున్న అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనుంది. ఆదాయ పన్నుశాఖ, ఆహార మంత్రిత్వశాఖకు అందజేసే వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో PMGKAY కోసం రూ. 2.03 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది.
అనర్హుల ఏరివేతకు ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శికి ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ సమాచారం అందచేస్తారని సీబీడీటీ తెలిపింది. లబ్ధిదారుల ఆధార్ నంబర్,పాన్‌తోపాటు మదింపు సంవత్సరాల వివరాలను లెక్కకట్టి ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో ప్రభుత్వం తేల్చనుంది. అనర్హులకు రేషన్ కట్ చేయనుంది.