ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే 8 నెలల జీతం ఇస్తామంటూ ట్రంప్ బై అవుట్ ఆఫర్ ప్రకటించారు. నేటితో ఆ ప్యాకేజీ ముగియనుంది. ఇప్పటి వరకు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆఫర్ కింద దరఖాస్తు చేసుకున్నారు.
అమెరికా ఏటా ప్రభుత్వ ఉద్యోగుల కోసం 1000 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. బై అవుట్ ప్యాకేజీ కింద కనీసం 3 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేస్తే ప్రభుత్వానికి 100 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్యాకేజీ గడువు పొడిగించే అవకాశముంది. కనీసం 15 శాతం ఖర్చు తగ్గించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ఆ ఆఫర్ ముందుకు తీసుకువచ్చింది.
ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారికి 8 నెలల జీతం ఇస్తామని, ప్రకటించినా ఎలాంటి అధికారిక హామీ లభించలేదని ఉద్యోగ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం పలు విధానాలు అమల్లోకి తీసుకు వచ్చింది.