తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మహిళ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు సహా మొత్తం 18 మందిని బదిలీ చేశారు.అన్యమత ప్రచారం విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న 69 మందిని టీటీడీ గుర్తించింది. టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఉన్నట్లు తేల్చారు. మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా అనధికార లెక్కలు ఉన్నాయి.