శారీరక సంబంధాలు…నగ్న వీడియోలు.. డ్రగ్స్
రాజ్ తరుణ్ -లావణ్య కేసులో భారీ ట్విస్ట్
లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్
శేఖర్ బాషాపై చర్యలు కోరుతూ పోలీసులకు వినతి
రాజ్ తరుణ్-లావణ్య కేసు లో భారీ ట్వీస్ట్ చోటుచేసుకుంది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా అనే మరో ఇద్దరు పై కేసు నమోదైంది. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి అరెస్టు కాగా శేఖర్ బాషాపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
డర్టీ మస్తాన్
మహిళలతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను రికార్డు చేసి భద్రపరిచిన మస్తాన్ సాయిని పోలసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మహిళతో లైంగిక చర్యలు, నగ్న వీడియోల మాటున బెదిరింపులు లావణ్య ఇంటిపై దాడిచేసిన కేసులో మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. మరింత లోతుగా విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేయనన్నారు.
ఫిర్యాదుదారు లావణ్యను మంగళవారం స్టేషన్‌కు పిలిపించిన పోలీసు అధికారులు , ఆమె ఫిర్యాదులో పేర్కొన్న విషయాలపై అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
గుంటూరులోని ఓ దర్గాకు మస్తాన్ సాయి తండ్రి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
కొన్నేళ్లుగా మస్తాన్‌సాయి పబ్‌లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపాడు. ఆ దృశ్యాలను వీడియోలు తీయడం, వారితో జరిపిన వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్క్ లో భద్రపరిచాడు.
వాటిని మస్తాన్ సాయి ఇంటి నుంచి లావణ్య తీసుకెళ్ళి పోలీసులకు అందించింది. హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్‌సాయి తన ఇంటిపై దాడిచేసి తనను హత్య చేసేందుకు యత్నించాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఆ సమయంలో ఆమె నివాసంలో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని లావణ్య ఆరోపించారు. లావణ్య ఇంటిపై దాడి కేసులో మస్తాన్ తో పాటు మరో ముస్లిం యువకుడిపై కేసు నమోదైంది.