ఎన్డీయే పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. గడిచిన పదేళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, వికసిత్ భారత్ సాధనే తమ ప్రభుత్వ లక్ష్యమని మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే పరమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. పేదలతో ఫొటోలు దిగడంతోనే పరిసెట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతి ఇంటికీ నీరు సరఫరా చేస్తోందన్నారు.
‘దిల్లీ నుంచి రూపాయి పంపితే.. గ్రామాలకు 16పైసలే చేరుతోంది’ అని గతంలో ఓ ప్రధాని వాపోయిన విషయాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో దిల్లీ నుంచి గల్లీ వరకూ ఒకే ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు.తమ ప్రభుత్వ హయాంలో దిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోందన్నారు. నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరుతుందన్నారు.