ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల నియామకం జరిగింది. ఈ మేరకు స్పీకర్ అయన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్‌గా కూన రవికుమార్, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు నియామకాన్ని ఆమోదిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో స్పీకర్ కార్యాలయం తెలిపింది. 175 మంది శాసనసభ్యుల నుంచి 9 మంది చొప్పున, 58 మంది శాసనమండలి సభ్యుల నుంచి ముగ్గురు చొప్పున మూడు కమిటీల్లో చోటు కల్పించారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. సమావేశాలు మూడు వారాలకుపైగా నిర్వహించే అవకాశం ఉంది. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.