అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై చర్చ…!
ప్రస్తుత రాజకీయపరిణామాలపై సమాలోచనలు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత ఆయన పార్టీనేతలో సమకాలీన రాజకీయాలపై నేరుగా సమావేశమై సమాలోచనలు చేశారు. తాడిపల్లిలోని వైసీపీ ఆఫీసులో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్యనేతలో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో పలు చోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరుగుతున్న తీరుపై వీరు చర్చకు వచ్చినట్లు సమాచారం. ‘కార్యకర్తలతో జగనన్న’ కార్యక్రమంపై అభిప్రాయాలు తీసుకున్నారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశం, పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.